Gold Theft : పనిచేస్తున్న షాపులోనే చోరీ భారీగా బంగారం స్వాధీనం

Update: 2024-07-19 07:06 GMT

బంగారం కరిగించే షాపులో నమ్మకం అనే ముసుగులో పనిచేస్తూ అదును చూసి భారీ మొత్తంలో బంగారాన్ని చోరీ చేసిన ఘరానా దొంగను సిసిఎస్‌ మరియు మట్వాడా పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేసారు. పోలీసులకు పట్టుబడిన ఈ దొంగ నుండి పోలీసులు సుమారు 52 లక్షల విలువగల 700 గ్రాముల బంగారు బిస్కెట్లతో పాటు ఒక సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘరానా దొంగ అరెస్టుకు సంబంధించి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా వివరాలను వెల్లడిస్తూ మహరాష్ట్ర సాంగ్లీ జిల్లా, సాల్సింగే తాలూకా, భాగ్యనగర్‌ ప్రాంతానికి చెందిన 30 సంవత్సరాల సురేష్‌ లక్ష్మన్‌బాద్‌ ఒంటరిగా జీవిస్తూ బంగారం వ్యాపారం నిర్వహిస్తుండేవాడు. ఈ వ్యాపారం ద్వారా వచ్చే అదాయంతో నిందితుడు త్రాగుడు, సట్టా,మట్కా లాంటి జూదాలను బానిస మారి అప్పుల పాలైయి కొద్ది రోజులు ఉపాధి కొసం ప్రయత్నించగా ఉపాధి దోరకపోవడంతో స్వంతం పిజ్జా వ్యాపారాన్ని కొద్ది రోజులు నిర్వహించి జల్సాల కారణంగా నిందితుడు మరోమారు ఈ వ్యాపారంలో నష్టపోయాడు. తాను చేసిన అప్పుల తీర్చాలంటే ఎదైనా బంగారం దుకాణంలో కొద్ది రోజులు నమ్మకంగా పనిచేసి అదును చూసి షాపులోని పెద్ద మొత్తంలో చోరీ చేసి దానిని అమ్మగా వచ్చే డబ్బుతో అప్పులు తీర్చి జల్సాలు చేయాలని నిందితుడు నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా తనకు పరిచయస్తుడి ద్వారా వరంగల్‌ నగరంలోని విశ్వకర్మ వీధిలో బంగారం కరిగించే బట్టి వ్యాపారాన్ని నిర్వహిస్తున్న సంజయ్‌ వద్ద నిందితుడు గత మే నెల 24తేదిన పనిలో చేరాడు. కొద్ది రోజులు నిందితుడు ఎంతో నమ్మకంతో పనిచేస్తూ దుకాణం యజమాని పూర్తి నమ్మకస్తుడిగా మారడంతో బట్టి దుకాణం యజమాని సంజయ్‌కి నిందితుడిపై నమ్మకం వుంచి షాపు సంబంధించిన తాళాలు అందజేసి బయటి వేళ్ళేవాడు.

ఈ క్రమంలో నిందితుడు పనిచేస్తున్న దుకాణంలో కరిగించేందుకు పెద్ద మొత్తంలో బంగారం షాపులోకి రావడంతో నిందితుడు షాపులో వున్న బంగారాన్ని చోరీ చేసేందుకు సిద్దపడ్డాడు. నిందితుడు అదును చూసి గత నెల జూన్‌ 14 వ తేదిన షాపు యజమాని సంజయ్‌ పనిపై బయటకి వెళ్ళడంతో నిందితుడు షాపులోని సిసి కెమెరాలను అపివేసి దుకాణంలో వున్న ఎనిమిది వందల గ్రామాల బంగారాన్ని చోరీ చేసిన అక్కడి నుండి పారిపోయినాడు.

జరిగిన దొంగతనంపై షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసారు. సెంట్రల్‌ జోన్‌ డిసిపి షేక్‌ సలీమా, అదనపు డిసిపి రవి అధ్వర్యంలో సిసిఎస్‌, మట్వాడా ఇన్స్‌స్పెక్టర్లతో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా పోలీసుల వద్ద వున్న టెక్నాలజీ వినియోగించుకోని పోలీసులు నిందితుడి కదలికలపై నిఘా కొనసాగించారు. ఈ నిఘాలో భాగంగా నిందితుడు చోరీ సోత్తును అమ్మేందుకు నిన్నటి రోజు అనగా జులై 18వ తేదిన సికింద్రబాద్‌ నుండి విజయవాడకు రైలులో ప్రయాణిస్తున్నట్లుగా నమ్మకమైన సమచారం పోలీసులకు రావడంతో నిన్నటి రోజు సాయంత్రం 6.30 గంటలకు వరంగల్‌ రైల్వే స్టేషనలో నిఘా పెట్టిన పోలీసులకు నిందితుడు ఫ్లాట్‌ఫారంపై మంచినీటి బాటిల్‌ కోనుగోలు చేస్తూండగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని తనీఖీ చేయగా చోరీ సోత్తును గుర్తించిన పోలీసులు నిందితుడుని పోలీసులు అరెస్టు చేసి విచారించగా. చోరీ అనంతరం నిందితుడు తన స్వగ్రామానికి వెళ్ళి మూడు రోజుల అనంతరం తన వద్ద వున్న ముద్ద బంగారాన్ని అమ్మేందుకు కష్టమవుతుందని పూణేలోని నస్రాపూర్‌లో బంగారాన్ని కరిగించే బట్టి వ్యాపారం నిర్వహిస్తున్న తన మిత్రుడైన సూరజ్‌ తానాజీ యాదవ్‌ ఆలియాస్‌ పింటు వద్ద చోరీ సోత్తు బంగారాన్ని కరిగించి వంద గ్రాముల చొప్పున ఎనిమిది బిస్కెట్లుగా మార్చి అందులో వంద గ్రాముల బంగారాన్ని సూరజ్‌ తానాజీ యాదవ్‌ ఆలియాస్‌ పింటుకి అమ్మినాడు.మిగిలిన 700 గ్రాముల బంగారాన్ని నిందితుడు నాగ్‌పూర్‌, అమరావతి, ముంబాయి,పూణే, హైదరాబాద్‌ ప్రాంతాల్లో అమ్మేందుకు యత్నించగా బంగారం అమ్ముడు పోక పోవడంతో నిందితుడు బంగారాన్ని విజయవాడలో అమ్మేందుకు రైలులో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసులకు చిక్కాడు. అలాగే నిందితుడు తమ స్నేహితుడికి అమ్మిన వంద గ్రాముల బంగారాన్ని త్వరలోనే స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని పోలీస్‌ కమిషనర్‌ మీడియా వెల్లడించారు

Tags:    

Similar News