Gun Misfire : గన్‌ మిస్‌ ఫైర్ .. అక్కడికక్కడే చనిపోయిన హెడ్‌ కానిస్టేబుల్

Gun Misfire : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గన్‌ మిస్‌ ఫైర్ అవడంతో హెడ్‌ కానిస్టేబుల్ సంతోష్‌ అక్కడికక్కడే చనిపోయాడు

Update: 2022-02-12 08:35 GMT

Gun Misfire : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గన్‌ మిస్‌ ఫైర్ అవడంతో హెడ్‌ కానిస్టేబుల్ సంతోష్‌ అక్కడికక్కడే చనిపోయాడు. ఇల్లందు మండలం కొమరారం పరిధిలోని కాచనపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. రాత్రి డ్యూటీలో ఉన్న పోలీసులు.. ఆయుధాలను పరిశీలిస్తుండగా తుపాకీ మిస్‌ ఫైర్ అయిందని పోలీసులు చెబుతున్నారు. హెడ్‌ కానిస్టేబుల్‌ మృతదేహాన్ని ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంతోష్‌ వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు చెబుతున్నారు. మూడు రోజుల క్రితమే సంతోష్‌కు పెళ్లి సంబంధం చూసొచ్చారు తల్లిదండ్రులు.

Tags:    

Similar News