తలను మలక్‌పేటలో వేసి శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచి
6 రోజుల క్రితం మలక్‌పేట మూసీ పరిసరాల్లో కవర్‌లో మొండెం లేని తల దొరికింది.పోలీసులు నిందితుడు చంద్రమౌళిని అరెస్ట్ చేశారు;
హైదరాబాద్‌లో నర్స్ దారుణ హత్యకు గురైంది. మృతదేహాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్‌లో ఉంచాడు నిందితుడు. మృతురాలు ఎర్రం అనురాధగా గుర్తించారు. 6 రోజుల క్రితం మలక్‌పేట వద్ద మూసీ పరిసరాల్లో.. ప్లాస్టిక్ కవర్‌లో మొండెం లేని తల దొరికింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు చంద్రమౌళిని అరెస్ట్ చేశారు. ఘటనా స్థలంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. చైతన్యపురిలోని చంద్రమౌళి ఇంట్లో దాచిపెట్టిన మృతురాలి శరీర భాగాల్ని పోలీసులు, క్లూస్ టీమ్ స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వడ్డీ వ్యాపారం వ్యవహారంలోనే హత్య జరిగినట్లు నిర్ధారించారు.
కేర్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న అనురాధ వడ్డీ వ్యాపారం కూడా నిర్వహిస్తోంది. నిందితుడు 7 లక్షలు తీసుకున్నాడు. డబ్బు విషయంలోనే పలుమార్లు గొడవలు జరిగినట్లు మృతురాలి సోదరి వెల్లడించింది. ఆరు రోజుల క్రితం మొండెం లేని తల గుర్తించిన సమయంలో.. మృతురాలి ఆచూకి తెలుసుకునేందుకు పోలీసులు 8 బృందాలు ఏర్పాటు చేశారు. మహిళ తలతో పోస్టర్లు ముద్రించి వాటిని పట్టుకుని అన్ని వీధుల్లో తిరిగారు. ఎట్టకేలకు ఈ కేసును పోలీసులు చేధించారు.