శామీర్‌పేట్ కాల్పుల కేసులో మనోజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అల్వాల్‌లో జడ్జి ఎదుట హాజరుపరిచారు. మనోజ్‌కు రిమాండ్ విధించారు. నిన్న సెలబ్రిటీ విల్లాలో సిద్ధార్ధ్‌పై ఎయిర్ గన్‌తో మనోజ్ కాల్పులు జరిపాడు. బాధితుడి ఫిర్యాదుతో ఆర్మ్స్ యాక్ట్ కింద మనోజ్‌పై కేసు నమోదు చేశారు. అటు.. మనోజ్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
సిద్ధార్ధ్ దాస్ అనే వ్యక్తి భార్య స్మితతో 2019లో విడిపోయాడు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. స్మిత శామీర్‌పేట్‌లో ఉండే మనోజ్‌తో సహజీవనం చేస్తోంది. పిల్లలను చూసేందుకు తండ్రి సిద్ధార్ద్ దాస్ విల్లాకు వెళ్లాడు. ఈ క్రమంలో స్మితతో గొడవ పడ్డాడు. దీంతో అక్కడే ఉన్న మనోజ్ ఆగ్రహానికి గురై ఎయిర్‌గన్‌తో సిద్ధార్ధ్‌పై కాల్పులు జరిపాడు. తప్పించుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.