Jharkhand :నవజాత శిశువు మృతి.. పోలీసులే చంపారన్న కుటుంబ సభ్యులు

Update: 2023-03-23 03:27 GMT

నాలుగు రోజుల నవజాత శిశువును పోలీసులు హత్య చేసినట్లు ఆరోపణలు రావడంతో జార్ధాండ్ ముఖ్యమంత్రి హెమంత్ సోరెన్ దర్యాప్తుకు ఆదేశించారు. ఈ ఘటన గిరిదిహ్ జిల్లాలోని కోసోగొండోడిఘి గ్రామంలో జరిగింది. నవజాత శిశువు తాత భూషన్ పాండే. ఇతనిపై ఓ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. అతన్ని వెతుక్కుంటూ ఇంటిని సెర్చ్ చేయడానికి పోలీసులు వెళ్లారు. పోలీసులను చూసిన భూషన్ పాండే ఇంట్లోని మహిళలు భయపడి బయటకు పరిగెత్తారు. అప్పుడు నాలుగు రోజుల నవజాత శిశువు ఇంట్లో పడుకుని ఉన్నట్లు ఆమె తల్లి నేహాదేవి తెలిపారు. పోలీసులు వెళ్లాక శిశువు ప్రాణంతో లేదని చెప్పారు. పోలీసులే తమ శిశువును చంపేశారని నేహ, కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఈ ఘటనపై స్పందించిన డిప్యూటీ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజయ్ రాణా మాట్లాడుతూ..  దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. మృతదేమాన్ని పోస్ట్ మార్టమ్ కోసం తరలించినట్లు చెప్పారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా స్పందిస్తూ.. ఇలాంటి ఘటనలను విచారించి కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది కాబట్టి పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు.

Similar News