Junior artist suicide : ప్రియుడు మోసం చేశాడని జూనియర్‌ ఆర్టిస్టు ఆత్మహత్య..!

Junior artist suicide : ప్రియుడు మోసం చేశాడని తీవ్ర మనస్తాపానికి గురై టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకుంది.;

Update: 2021-09-30 03:58 GMT

Junior artist suicide: ప్రియుడు మోసం చేశాడని తీవ్ర మనస్తాపానికి గురై టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కావలి అనురాధ అనే యువతి ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్‌నగర్‌ బస్తీలో నివాసం ఉంటుంది. సినీ పరిశ్రమలో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేస్తోంది. కొన్నాళ్ళు కిరణ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న ఆమె అతడితో సహజీవనం చేస్తోంది. అయితే అతడు మరో అమ్మాయితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. ఈ విషయంలో కిరణ్ తో గొడవపడిన అనురాధ.. మనస్తాపానికి గురై తన గదిలో ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకి సమాచారం ఇవ్వడంతో విషయం బయటపడింది. మృతురాలి సోదరి సరోజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు కిరణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News