Badvel Student Case: పెళ్లి చేసుకోమన్నందుకే విద్యార్థిని హత్య

ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో సంచలన విషయాలు.. వెల్లడించిన కడప ఎస్పీ హర్షవర్ధన్‌;

Update: 2024-10-21 02:30 GMT

బద్వేలులో ఇంటర్ విద్యార్థినిని పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో నిందితుడు విఘ్నేశ్‌ కుట్ర ప్రకారమే బాలికపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడని కడప ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు తెలిపారు. బాలికకు ఐదుళ్లుగా విఘ్నేష్‌తో పరిచయం ఉందని, పెళ్లి చేసుకోమని అడగడం వల్లనే బాలికపై ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వివరించారు. కడప రిమ్స్‌లో ఇంటర్‌ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. బద్వేల్‌ పెట్రోల్ దాడి ఘటనలో నిందితుడు విఘ్నేష్‌ను అరెస్టు చేసి, మీడియా సమావేశంలో వివరాలను ఎస్పీ వెల్లడించారు. మృతి చెందిన విద్యార్థిని, విఘ్నేశ్ ఒకే ఊరికి చెందిన వారని.. ఇద్దరు కొంత కాలంగా ప్రేమించుకున్నారని 6 నెలల క్రితం విఘ్నేష్ వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకోవడంతో హత్యకు దారి తీసిందన్నారు. ఒకసారి మాట్లాడుదాం అని పిలవడంతో ఇద్దరు కలిసి బద్వేలు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్ళినట్లు ఎస్పీ వెల్లడించారు.


పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినందుకే

పెళ్ళి చేసుకోవాలంటూ అమ్మాయి ఒత్తిడి చేయడంతో ముందస్తు ప్లాన్ ప్రకారం తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లు తెలిపారు. 'నిందితుడు ప్లాన్ ప్రకారమే దాడి చేశాడు. ఐదేళ్లుగా వారికి పరిచయం ఉంది. ప్రేమించుకుని విడిపోయారు. సూసైడ్ చేసుకుంటానని బెదిరించడంతో అమ్మాయి అతడిని కలవడానికి వెళ్లింది. తర్వాత వాగ్వాదం జరగగా, విఘ్నేశ్ ఆమెకు నిప్పంటించాడు అని కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. యువతి కాలిన గాయాలతో ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చిందని, యువతికి బద్వేలు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో ప్రాథమిక చికిత్స చేసిన తరువాత మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. అయితే 80 శాతం కాలిన గాయాలతో చికిత్సపొందుతూ యువతి చనిపోయిందని అన్నారు. యువతికి ఐదేళ్లుగా విఘ్నేష్‌ అనే వ్యక్తితో పరిచయం ఉందని తెలిపారు. కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారని, ఆరు నెలల క్రితం మరో యువతిని విఘ్నేష్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్నారు.

ప్రత్యేక కోర్టుకు సిఫారసు

ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అమ్మాయిని బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సీ పేర్కొన్నారు. నిందితుడు విగ్నేశ్ పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని.. కేసును లైంగిక వేధింపుల కేసుల్లో త్వరితగతిన విచారణ కోసం ప్రత్యేక కోర్టుకు సిపార్స్ చేస్తున్నామన్నారు. ఈ ఘటన జరిగిన ఒక్క రోజులోనే ముద్దాయిని అరెస్టు చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.

Tags:    

Similar News