భార్యను దారుణంగా చితక్కొట్టి.. అడ్డు వచ్చిన మామను..
Husband Attck his Wife: మహిళలపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు వరకట్నం నిషేదం విధిస్తుంటే..;
Husband Attck his Wife: మహిళలపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు వరకట్నం నిషేదం విధిస్తుంటే.. మరోవైపు మహిలళపై మృగాళ్ల దాష్టికం కొనసాగుతూనే ఉంది. సమాజంలో మహిళలపై రోజురోజుకు గృహహింస వేధింపులు ఎక్కువయ్యాయి. మహిళను కట్నం కోసం భర్త వేధింపులకు గురిచేయడంతోపాటు మామాను కూడా చితకొట్టిన దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
కేరళలోని కొచ్చికి చెందిన మహిళను ఏప్రిల్ 12న ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. వీరిద్దరికి ఇది రెండో వివాహం. పెళ్లైనప్పటి నుంచే ఆ మహిళకు భర్త నుంచి వేధింపులు మొదలైయ్యాయి. అదనపు కట్నం కావాలని ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. ఈ క్రమంలో మహిళ బంగారాన్ని భర్త తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నాడని తెలిసి ఆమె తల్లిదండ్రులు ఆ బంగారాన్ని బ్యాంక్ లాకర్‌కు మార్చారు. ఈ విషయం తెలిసిన భర్త ఆమెను శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు.
అంతేగాక భార్యకు అన్నం కూడా పెట్టకుండా బాధపెట్టారు. ఈ క్రమంలో జూలై 9 న భార్యను ఇంటి నుంచి బయటకు గెంటేశారు. దీంతో వివాహిత సరాసరీ తన తండ్రి ఇంటికి వెళ్ళడంతో పంచాయతీకి జూలై 17న మహిళ తండ్రి కూతురు అత్తగారింటికి వచ్చారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త ఆమెపై దాడికి తెగబడ్డాడు. మధ్యలో అడ్డు వచ్చిన మామని చితకబాది పక్కటెముకలు విరగొట్టాడు. జూలై 23 న పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా.. ఐపీసీ సెక్షన్లు 498 ఎ, 323, 506, 34తో పాటు వరకట్నం నిషేధ చట్టంలోని సెక్షన్ 3, 4 కింద భర్త, అతని తల్లిదండ్రులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.