Krishna District: బ్యూటీషియన్ ముసుగులో గంజాయి దందా..
Krishna District: బ్యూటీషియన్ ముసుగులో గంజాయి దందా చేస్తున్న మహిళను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.;
Krishna District: బ్యూటీషియన్ ముసుగులో గంజాయి దందా చేస్తున్న మహిళను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. గుడ్లవల్లేరు సంత రోడ్డులో నివాసం ఉంటున్న బ్యూటీషియన్ హాలీ మున్నీసా బేగం ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఫ్రిడ్జ్‌లో దాచిన 550 గ్రాముల గంజాయిని సీజ్ చేసి మహిళను అరెస్ట్ చేశారు. భర్తతో విడిపోయిన ఆమె.. మరో వ్యక్తి సాధిక్‌తో సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవలే సాధిక్ కూడా గంజాయి కేసులో అరెస్టై జైలుకు వెళ్లారని వెల్లడించారు. అతను ఇచ్చిన వివరాల ఆధారంగానే బ్యూటీషియన్ ఇంట్లో దాడులు నిర్వహించామన్నారు.