AP : అపార్టుమెంట్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినవాడిపై 23 కేసులు

Update: 2024-10-08 15:45 GMT

గుంటూరు నగరంలోని కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో లైంగికదాడి కేసులో నిందుతుడిని అరెస్టు చేసినట్లు గుంటూరు ఈస్ట్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్ వెల్లడించారు. ఈ నెల 4వ తేదీ తెల్లవారు జామున ఎన్టీఆర్ బస్టాండ్ వద్ద నుంచి 3 గంటలకు టీ తాగి వస్తున్న జంటను పాముల గోపి బెదిరించాడు. ఆ అమ్మాయిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని నమ్మించి బండి ఎక్కించుకుని వెళ్లాడు. బుచ్చయ తోట ట్రాక్ వద్ద వున్న అపార్టుమెంట్ లోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. నిందితుడిపై మొత్తం 23 కేసులు ఉన్నట్లు గుర్తించామని డీఎస్పీ తెలిపారు. బాధి తురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడి గోపిని అరెస్టు చేశామని వివరించారు.

Tags:    

Similar News