ATTACK: మంచు మనోజ్ పై మోహన్ బాబు దాడి

Update: 2024-12-08 06:00 GMT

నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే మంచు ఫ్యామిలీలో మరోసారి విభేదాలు తార స్థాయికి చేరాయి. తాజాగా తన తండ్రి మోహన్ బాబు తనపై, తన భార్యపై దాడి చేశారని గాయాలతో పీఎస్ కు వచ్చి ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. స్కూల్, ఆస్తుల వ్యవహారంపై ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తండ్రి మోహన్ బాబుపై మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై, తన భార్యపై మోహన్ బాబు దాడి చేశారని మంచు మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మనోజ్ కూడా తనపై దాడి చేశారని మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తులు, స్కూల్ అంశాలపై వీరిమధ్య విభేదాలున్నాయి. మోహన్ బాబు- మంచు మనోజ్ పరస్పర ఫిర్యాదులతో టాలీవుడ్ లో కలకలం రేగింది.

Tags:    

Similar News