పహాడీ షరీఫ్‌లో యువతిపై సామూహిక లైంగిక దాడి..!
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు మహిళలపై సామూహిక లైంగిక దాడి ఘటన వెలుగులోకి వచ్చి... ఒక్క రోజైనా గడవకముందే భాగ్యనగరంలో మరో యువతిపై అఘాయిత్యం జరిగింది.;
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు మహిళలపై సామూహిక లైంగిక దాడి ఘటన వెలుగులోకి వచ్చి... ఒక్క రోజైనా గడవకముందే భాగ్యనగరంలో మరో యువతిపై అఘాయిత్యం జరిగింది. పహాడీ షరీఫ్‌లో ఓ యువతిపై సామూహిక లైంగిక దాడి ఘటన వెలుగు చూసింది. ఆటో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి... తనపై అఘాయిత్యం చేశారని ఓ యువతి సంతోష్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేపట్టారు. ఉద్యోగం ముగించుకుని వెళ్తున్న ఓ యువతి హైదరాబాద్ సంతోష్ నగర్‌లో ఆటో ఎక్కారు. ఆటోను పహాడీ షరీఫ్ వైపు తీసుకెళ్లిన డ్రైవర్... అక్కడ మరో వ్యక్తిని ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆటోను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన తర్వాత... ఇద్దరూ లైంగిక దాడికి పాల్పడ్డట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించిన పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.