Private Videos Case : ప్రైవేటు వీడియోల కేసు.. డ్రగ్ టెస్ట్‌లో నిందితులకు పాజిటివ్
అమ్మాయిల ప్రైవేట్ వీడియోల కేసులో అరెస్టైన మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. డ్రగ్ టెస్ట్‌లో మస్తాన్ సాయి, అతని ఫ్రెండ్ ఖాజాకు పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో మస్తాన్‌పై NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు. 2022లో తన ఇంట్లో పార్టీ నిర్వహించిన మస్తాన్ సాయి ఆ సమయంలో తనకు డ్రగ్స్ ఇచ్చి ప్రైవేట్ వీడియోలు తీశారని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు.
గతేడాది జూన్ 3న డ్రగ్స్ కోసం విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన తనిఖీల్లో మస్తాన్ సాయి దాదాపుగా పోలీసుల చేతికి చిక్కాడు. కానీ అదే సమయంలో వెంటనే వారి కళ్లు గప్పి తప్పించుకున్నాడు. అప్పటినుండి మస్తాన్ సాయిపై పోలీసుల ఫోకస్ ఉంది. ఎట్టకేలకు గుంటూరులో అతడు పోలీసుల చేతికి చిక్కాడు. కొన్నాళ్ల క్రితం హీరో రాజ్ తరుణ్.. లావణ్య అనే అమ్మాయిని మోసం చేశాడంటూ వచ్చిన వార్తల్లో కూడా మస్తాన్ సాయి అనే పేరు పదేపదే వినిపించింది.
కానీ అతడు ఎవరు అనే పూర్తి సమాచారం అప్పుడు బయటపడలేదు. మొత్తానికి న్యూడ్ వీడియోలు, డ్రగ్స్ కేసు వల్ల అసలు మస్తాన్ సాయి ఎవరు, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనే విషయాలు మెల్లమెల్లగా బయటికొస్తున్నాయి