Hyderabad : ఓవరాక్షన్ చేసిన ఆ ట్రాఫిక్ సీఐ..
Hyderabad : ఫ్రెండ్లీ పోలీస్ చేయాల్సిన వారే సామాన్యులను విచక్షణా రహితంగా పబ్లిక్‌లో కొడుతున్నారు.;
Hyderabad : ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ పోలీస్ శాఖలోతనదైన శైలీలో వాహనదారులపై ప్రతాపం చూపెడుతున్నారు కొందరు పోలీస్ అధికారులు.బుధవారం రాత్రి మియాపూర్ ప్రాంతంతో అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.అయితే ఈ తనిఖీల్లో ట్రాఫిక్ సీఐ అతిగా ప్రవర్తించారు.చేతిలో అధికారం ఉంది కదాని ఓ వాహనదారుడిపై చేయిచేసుకున్నారు ట్రాఫిక్ సీఐ సుమన్.
వాహనదారుడిని తిట్టుకుంటూ కాలర్ పట్టుకొని లాక్కెళ్లి మరీ కొట్టాడు సీఐ. అయితే ట్రాఫిక్ అధికారులకు కొట్టే అధికారం లేదని తప్పుచేస్తే కేసు నమోదు చేయాలని బాధితుడు చెపుతున్నా వినకుండా.. నాకే ఎదురు చెపుతావా..? అంటూ రెచ్చిపోయాడు మియాపూర్ ట్రాఫిక్ సీఐ సుమన్. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. సీ.ఐపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.