Mohali Swing Accident : 50 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డ జెయింట్ వీల్..

Mohali Swing Accident : ఆదివారం. పైగా సెలవు రోజు. సండేను ఫన్‌డేగా.. జాలీగా గడపాలని అనుకున్నారు;

Update: 2022-09-05 09:55 GMT

Mohali Swing Accident : ఆదివారం. పైగా సెలవు రోజు. సండేను ఫన్‌డేగా.. జాలీగా గడపాలని అనుకున్నారు. పిల్లలతో కలిసి సరదాగా ఎగ్జిబిషన్‌కు వెళ్లారు. కానీ ఎంజాయ్ డే కాస్త.. బ్యాడ్‌డేగా మిగిలిపోయింది. అప్పటివరకు కేరింతలతో మార్మోగుతున్న మైదానం కాస్త హాహాకారాలతో మిన్నంటాయి. ఏంజరిగిందో తెలుసుకునే లోపే క్షణాల్లో అందరూ ఒక్కసారిగా కిందపడిపోయారు. పంజాబ్‌లోని మొహాలీ ఎగ్జిబిషన్‌లో ఈ ప్రమాదం ఘటన జరిగింది.

దాదాపు 50 అడుగుల ఎత్తు నుంచి జెయింట్‌ స్వింగ్ కింద పడింది. 16 మందికి గాయాలు కాగా.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాద సమయంలో జెయింట్‌ స్వింగ్‌పై 30 మంది ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

Tags:    

Similar News