హైదరాబాద్‌లో దారుణం.. యువతికి బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం..
ఓ హోటల్‌లో ఆమెకు మద్యం తాగించి జుబేర్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డట్లు ఫిర్యాదు నమోదైంది.;
ముంబైకి చెందిన ఓ యువతిపై హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బర్త్‌డే పార్టీ పేరిట ఓ పథకం ప్రకారం ముంబై నుంచి యువతిని రప్పించి.. ఓ హోటల్‌లో ఆమెకు మద్యం తాగించి జుబేర్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డట్లు ఫిర్యాదు నమోదైంది. తనకు జరిగిన అన్యాయంపై ముంబైలో బాధితురాలు ఫిర్యాదు చేయగా.. కేసు బంజారాహిల్స్ పీఎస్‌కు ట్రాన్స్‌ఫర్ అయింది. జుబేర్, ప్రజక్త, స్వీటీ లపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బాధితురాలి స్టేట్‌మెంట్ తీసుకొని విచారణ ప్రారంభించనున్నారు.