హైదరాబాద్ చైతన్య పురి వాసవి కాలనీలో మైనర్ బాలికపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో బాలిక చేతికి గాయాలయ్యాయి. చైతన్య పురి పోలీసులకు విద్యార్థిని తండ్రి నితిన్ జోషి పిర్యాదు చేశారు. ఎల్బీనగర్ అడిషనల్ డీసీపీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. నితిన్ జోషికి ఐదుగురు కుమార్తెలు. వీరిలో ఓ కూతురు కొత్త పేటలోని కాలేజీలో ఇంటర్ చదువుతోంది. ఉదయం విద్యార్థిని కాలేజీకి వెళుతున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు రోడ్డుపై అడ్డగించారు. రెండు చేతులు పట్టుకుని బ్లేడ్ తో దాడికి యత్నించారు. విద్యార్థిని వారిని నెట్టేసి పరుగులు పెట్టింది. తండ్రికి చెప్పగా పోలీసులకు సమాచారం అందించారు.