అదనపు కట్నం వేధింపులు... నవవధువు ఆత్మహత్య..!
మూడు నెలల క్రితం వివాహం జరగగా... అదనపు కట్నం కోసం అత్తమామలు వేధింపులకు గురి చేశారని బాధిత యువతి తండ్రి తెలిపారు.;
అనంతపురం జిల్లా మల్లమ్మకొట్టాలలో నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. మూడు నెలల క్రితం వివాహం జరగగా... అదనపు కట్నం కోసం అత్తమామలు వేధింపులకు గురి చేశారని బాధిత యువతి తండ్రి తెలిపారు. మనో వేధనతో కొన్ని రోజుల నుంచి పుట్టింట్లోనే ఉంటోందని చెప్పారు. ఎస్‌బీఐలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న కేశవయ్యతో... మూడు నెలల క్రితం ఘనంగా పెళ్లి జరిపించామని తెలిపారు. పెళ్లయినప్పటి నుంచి వేధింపులతో తమ కూతురుకు నరకం చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతురు మృతికి అల్లుడు కేశవయ్య, ఆయన తల్లిదండ్రులే కారణమంటూ... సాధిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు... బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సాధిక మృతదేహం వెలికి తీసేందుకు అగ్నిమాపకశాఖ సిబ్బంది, పోలీసులు, గ్రామస్థులు తీవ్రంగా శ్రమించారు. ఆయిల్ ఇంజిన్ ద్వారా నీటిని బయకు పంపించారు. మూడు గంటల పాటు 20 మీటర్ల లోతు నీళ్లను తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. సాధిక తండ్రి ఫిర్యాదుపై దర్యాప్తు చేపడతామని కదిరి ఇంఛార్జి డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి తెలిపారు.