ఉద్యోగం వచ్చి ఎనిమిది నెలలు.. లంచం తీసుకుంటూ..
ప్రభుత్వ అధికారులు.. పెద్ద పోస్టులు, జీతాలు కూడా బాగానే ఉంటాయి.. దాంతో పాటు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు.. అయినా చేయి చాపుతారు..;
ప్రభుత్వ అధికారులు.. పెద్ద పోస్టులు, జీతాలు కూడా బాగానే ఉంటాయి.. దాంతో పాటు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు.. అయినా చేయి చాపుతారు.. అందిన కాడికి దోచుకుందామని అనుకుంటారు.. దొరికితే అడ్డంగా బుక్కవుతామన్న ఆలోచన అస్సలు ఉండదు.. ఉద్యోగంలో జాయినై ఎనిమిది నెలలు కూడా కాలేదు.. అప్పుడే లంచాలకు అలవాటు పడింది హజారీబాగ్ కు చెందిన ప్రభుత్వ అధికారి మిథాలీ శర్మ.
హజారీబాగ్ యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) బృందం లంచం తీసుకుంటుండగా ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మిథాలీ ఎనిమిది నెలల క్రితం జార్ఖండ్‌లోని కోడెర్మాలో సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా నియమించారు. ఇది ఆమె మొదటి పోస్టింగ్. మిథాలీ శర్మను జులై 7న హజారీబాగ్ ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆమె లంచం తీసుకుంటున్న వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వచ్చిన ఆరోపణలపై ఏసీబీ బృందం విచారణ చేపట్టగా.. మిథాలీ శర్మ కమిటీ నుంచి రూ.20 వేలు డిమాండ్ చేసినట్లు నిర్ధారించింది. అనంతరం కేసు నమోదు చేసి ఉచ్చు బిగించారు. నిఘా బృందం శర్మను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.