Nizamabad Terror Training : నిజామాబాద్ అడ్డాగా ఉగ్రశిక్షణ
Nizamabad Terror Training : నిజామాబాద్ జిల్లాలో ఉగ్ర మూలాలు బయటపడడం ఇప్పుడు సంచలనంగా మారింది.;
Nizamabad Terror Training : నిజామాబాద్ జిల్లాలో ఉగ్ర మూలాలు బయటపడడం ఇప్పుడు సంచలనంగా మారింది. PFI ముసుగులో మత ఘర్షణలు రెచ్చగొట్టేందుకు శిక్షణ ఇస్తున్న అబ్దుల్ ఖాదర్‌ను రెండ్రోజుల క్రితం అరెస్టు చేయగా.. తాజాగా షేక్ షాదుల్లా, మహమ్మద్ ఇమ్రాన్, మహ్మద్ అబ్దుల్ మోబిన్‌లను అదుపులోకి తీసుకున్నారు. కరాటే శిక్షణ, న్యాయ అవగాహన తరగతుల పేరుతో కార్యక్రమాలు చేస్తున్న వీళ్లంతా.. మత ఘర్షణలకు ప్లాన్ చేస్తున్నట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు.
కేరళ, జార్ఖండ్ సహా మరికొన్ని చోట్ల కూడా ట్రైనింగ్ పేరుతో టెర్రర్ క్యాంప్‌లకు సపోర్ట్ చేస్తున్న విషయమూ వెలుగులోకి వచ్చింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. క్లుప్తంగా PFI. కానీ ఈ పేరుకు ఈ నిర్వహకులు చేస్తున్న దానికీ పొంతనే లేదనేది పోలీసుల మాట. దేశంలో మత కల్లోలాలు రెచ్చగొట్టడమే లక్ష్యంగా, అలా ఘర్షణలు చెలరేగినప్పుడు వాటికి మరింత ఆజ్యం పోసేలా దాడులు చేయడమే టార్గెట్‌గా ఇందులో చేరే వాళ్లకు శిక్షణ ఇస్తున్నట్టు కొన్ని క్లూస్ దొరికాయి.
అమాయకులైన యువతను టార్గెట్ చేసి మతం మత్తులోకి లాగి విద్వేషం నింపడమే వీరు టార్గెట్‌గా పెట్టుకుని పనిచేస్తున్నారు. ఈ PFI గ్రూప్‌లో యాక్టివిస్ట్‌లకు నిషేధిత సంస్థ 'సిమీ'తోనూ సంబంధాలు ఉండడం కలకలం రేపుతోంది. 2 నెలలుగా నిజామాబాద్‌లో ఖాదర్ దగ్గర శిక్షణ పొందిన వారితోపాటు 26 మంది కోసం ఇప్పుడు గాలింపు చేపట్టారు.
నిజామాబాద్ క్యాంప్‌లో మొత్తం 200 మందికి శిక్షణ ఇచ్చినట్టు అనుమానిస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్ నుంచే కాకుండా ఏపీలోని కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం నుంచి కూడా కొందరు యువకులు ఇక్కడికి వచ్చారు. నిజామాబాద్ ఆటోనగర్‌లో అబ్దుల్ ఖాదర్ ఈ శిక్షణ ఇస్తున్నట్టు సీపీ నాగరాజు చెప్పారు. ఈ ఆరోపణలను PFI నేతలు ఖండించారు. వృత్తి రీత్యా ఖాదర్ కరాటే ట్రైనర్ అని ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ దేశద్రోహిగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.
ఈ కేసులో అరెస్టైన నలుగురి సెల్‌ఫోన్లను సీజ్ చేసిన పోలీసులు.. వారి కాల్‌డేటా ఇతర సమాచారాన్ని విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నారు. భైంసా అల్లర్లతో ఈ PFIకి సంబంధం ఉందా.. రీసెంట్‌గా ట్రైనింగ్ తీసుకున్న 26 మంది ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది తేల్చేందుకు ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దించారు పోలీసులు. అభిప్రాయపడుతున్నారు.