Banjara Hills Drugs Case: ఫుడింగ్ అండ్‌ మింక్‌ పబ్‌‌ డ్రగ్స్ కేసులో కొందరు వీఐపీలకు త్వరలో నోటీసులు

Banjara Hills Drugs Case: ఫుడింగ్ అండ్‌ మింక్‌ పబ్‌ వ్యవహారంలో బంజారాహిల్స్‌ పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది.;

Update: 2022-04-08 08:15 GMT

Banjara Hills Drugs Case: ఫుడింగ్ అండ్‌ మింక్‌ పబ్‌ వ్యవహారంలో బంజారాహిల్స్‌ పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. పబ్‌లో 20 మందికి డ్రగ్స్ సరఫరా చేసినట్టు ఆధారాలు సేకరించిన స్పెషల్ టీమ్‌.. త్వరలోనే వారికి నోటీసులు ఇవ్వాలని భావిస్తోంది. డ్రగ్స్ తీసుకున్న వాళ్ల లిస్ట్‌లో కొందరు VIPలు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. వారీకీ నోటీసులు వెళ్లబోతున్నాయి. అటు.. ఈ డ్రగ్స్ దందా మొత్తం పబ్‌ మేనేజర్‌ అనిల్‌తోపాటు అభిషేక్‌ కనుసన్నల్లోనే జరిగిందని చెప్పేందుకు మరిన్ని క్లూస్‌ సంపాదించగలిగారు. అభిషేక్‌ ఫోన్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌లో గోవా, ముంబైకి చెందిన వ్యక్తుల సమాచారం దొరికింది.

ఇక మేనేజర్‌ అనిల్‌కి గతంలో డ్రగ్స్‌ కేసులో పట్టుబడ్డ పెడ్లర్స్‌తో సంబంధాలు బయటపడ్డాయి. వీళ్లు ఇద్దరూ కలిసి గోవా, ముంబై నుంచే డ్రగ్స్ తెప్పించి ఇక్కడ.. స్టార్‌ హోటల్‌లో దర్జాగా బిజినెస్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్‌ కేసులో నోటీసులు పంపించడం మొదలుపెట్టాక.. వెంటనే వాళ్ల బ్లడ్‌ శాంపిల్స్‌ కూడా తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు.. అనిల్‌, అభిషేక్‌ల కస్టడీ పిటిషన్లపై కోర్టు పరిణామాలు కూడా ఆసక్తికరంగా మారాయి. మరింత సమాచారం మా క్రైంబ్యూరో చీఫ్‌ సునీల్‌ అందిస్తారు.

Tags:    

Similar News