Bhadradri Kothagudem : అబార్షన్ వికటించి యువతి మృతి.. పరారీలో ప్రియుడు..
Bhadradri Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో దారుణం జరిగింది. వైద్యం వికటించి యువతి మృతి చెందింది.;
Bhadradri Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో దారుణం జరిగింది. వైద్యం వికటించి యువతి మృతి చెందింది. భూక్యా నందు అనే యువకుడు ప్రేమ పేరుతో డిగ్రీ యువతిని నమ్మించి గర్భవతిని చేసాడు. తర్వాత యువతికి ఒక ప్రైవేటు ఆస్పత్రిలో అబార్షన్ చేయించాడు. అయితే, వైద్యం వికటించడంతో యువతి మరణించింది. ఈ ఘటన తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగింది. విషయం తెలుసుకున్న భూక్యా నందు అక్కడ్నుంచి పరారయ్యయాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. యువకుడి కోసం గాలిస్తున్నారు.
యువతి మృతితో తల్లిదండ్రుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. యువకుడి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. నిందితుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ యువతి మృతదేహంతో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు.