AP : వృద్దుడి ప్రాణం తీసిన ఆస్తి వివాదం.. నాటు తుపాకితో కాల్చి!

Update: 2025-08-06 12:15 GMT

ఆస్తి వివాదం ఒక వృద్దుడు నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.ఆస్తి పిల్లలకు ఉపయోగపడుతుందని భావించి మంచి చేయాలనే తలంపే ఆ వృద్ధుడి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఆస్తి ఇచ్చేస్తే పిల్లలు భవిష్యత్తు ఏమైపోతుందోమని భావించిన వృద్ధుడు మంచి ఆశయమే ప్రాణాలను బలిగొంది. ఆ వృద్ధుడు చెప్పిన మంచి మాటలు ఆ కసాయి వాడికి చెడుగానే అనిపించాయి. ఆస్తికి బంగారు నగలకు చెందకుండా చేస్తాడని అనుమానంతో వృద్ధుడిని పిట్టల్ని కాల్చినట్టు నాటు తుపాకీ కాల్చిన ఘటన కొత్తవలస మండలం ముడిరాం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం ముసిరాం గ్రామంలో సిమ్మ అప్పారావు (70) అనే వ్యక్తి నివాసం ఉంటాడు. అదే గ్రామంలో ఇంకో సిమ్మా అప్పారావు నివాసం ఉంటున్నాడు .మృతుడు శిమ్మ అప్పారావు మేనకోడల్ని యువకుడైన శిమ్మా అప్పారావు కి ఇచ్చి వివాహం చేశారు. కొంతకాలం తర్వాత ఆమె మృతి చెందింది .ఆమె ను ఆమె భర్త సిమ్మ అప్పారావ్ చంపాడనే ఆరోపణ ఉంది.అప్పట్లో సీమ్మ అప్పారావు పై కేసు కూడా పెట్టలేదు. ఆ సమయంలో కొంత బంగారం భూమి ఆ భూమి విషయమే ఇద్దరు అప్పారావు ల మధ్య వారంరోజుల క్రితం గొడవలు జరిగాగాయి. సమయంలోనే పెద్ద సిమ్మా అప్పారావును చిన్న సిమ్మ అప్పారావు చంపేస్తానని హెచ్చరించాడు. భూమి నగలు నాకు ఇచ్చేయాలని పెద్ద అప్పారావునపై చిన్న అప్పారావు వత్తిడి తెచ్చాడు. భూమి మాత్రం పిల్లల పేర్లు రాస్తామని నగలు చిన అప్పారావు కి ఇస్తానని పెద్ద అప్పారావు చెప్పాడు .దీంతో మంగళవారం సాయంత్రం కల్లం వద్ద ఇద్దరి మధ్య తగాదా జరగడంతో నాటు తుపాకీతో పెద్ద సమ్మ అప్పారావు ను చిన్న సమ్మ అప్పారావు కాల్చిడంతో పెద్ద అప్పారావు అక్కడికక్కడే మృతి చెందాడు .స్థానికులు కొత్తవలస పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృద్దేహాన్ని శృంవరపుకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.కొత్తవలస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News