Actress Arrested : నటన ముసుగులో వ్యభిచారం.. గుట్టు రట్టు చేసిన పోలీసులు

Update: 2025-09-06 16:30 GMT

నటన ముసుగులో వ్యభిచార దందా నడుపుతున్న ఒక నటిని థానే పోలీసులు అరెస్ట్ చేశారు. డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌లో టీవీ సీరియళ్లు, బెంగాలీ సినిమాల్లో నటిస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు రక్షించారు. 41 ఏళ్ల అనుష్క మోని మోహన్‌దాస్‌ అనే నటి కొంతకాలంగా ఈ అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తోంది. సినిమా అవకాశాల కోసం ఎదురుచూసే యువ నటీమణులను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యభిచార కూపంలోకి దింపుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

డెకాయ్ ఆపరేషన్

ఈ దందాపై విశ్వసనీయ సమాచారం అందుకున్న థానే పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇద్దరు పోలీసు సిబ్బందిని డెకాయ్ కస్టమర్లుగా అనుష్క వద్దకు పంపించారు. వారు సంప్రదించగా, అనుష్క డీల్ ఖరారు చేసింది. డబ్బు ఇచ్చే సమయంలో, ముందుగానే సిద్ధంగా ఉన్న పోలీసు బృందం ఒక్కసారిగా దాడి చేసి అనుష్కను అదుపులోకి తీసుకుంది. ఈ దాడిలో ఇద్దరు మహిళలను రక్షించినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మదన్ బల్లాల్ మీడియాకు తెలిపారు. నిందితురాలు అనుష్క మోహన్‌దాస్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ దందాలో ఇంకా ఎవరెవరు పాలుపంచుకున్నారనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Tags:    

Similar News