అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం సమీపంలో పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఫటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో పేరుడు జరిగినట్లు చెప్పారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని తెలిపారు. వారం వ్యవధిలో మూడవ పేలుడు సంభవించినట్లు చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్, మోబైల్ సిగ్నల్స్ ఆధారంగా ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరు పేలుడుకు పథకం వేసినట్లు చెప్పారు. దేవాలయం సమీపంలోని ఓ వాష్ రూంలో ఐఈడీలను అమర్చినట్లు తెలిపారు. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే ఈ పేళుళ్లకు ముఖ్య కారణమని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ పేలుళ్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ చేపట్టనుంది. గురువారం నాటి పేలుడుకు కారణమైన క్రాకర్‌లో పొటాషియం క్లోరేట్‌ను ఉపయోగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పంజాబ్ పోలీసులు విలేకరులతో మాట్లాడుతూ, భవనం వెనుక కొన్ని ముక్కలు కనిపించాయని చెప్పారు. "అర్ధరాత్రి 12.15 - 12.30 గంటల ప్రాంతంలో పెద్ద శబ్ధం వినిపించింది. మరో పేలుడు సంభవించే అవకాశం ఉన్నట్లు చెంది. భవనం వెనుక కొన్ని ముక్కలు కనుగొనబడ్డాయి. చీకటిగా ఉన్నందున కనుక్కోవడం కష్టంగా ఉంది.” అని పోలీసు కమిషనర్ నౌనిహాల్ సింగ్ విలేకరులతో అన్నారు. పేలుడు జరిగిన సమయంలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ సమీపంలోని గదిలో ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి.