YouTube video : యూట్యూబ్ వీడియో చూసి అబార్షన్‌కు ట్రై చేసి .. చివరికి ఏమైందంటే..!
YouTube video : యూట్యూబ్ వీడియోలను చూస్తూ ఇంట్లో అబార్షన్ చేసుకోవడానికి ఓ యువతి ప్రయత్నిచింది. కానీ చివరికి ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రి పాలైంది.;
YouTube video : యూట్యూబ్ వీడియోలను చూస్తూ ఇంట్లో అబార్షన్ చేసుకోవడానికి ఓ యువతి ప్రయత్నిచింది. కానీ చివరికి ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రి పాలైంది. ఈ సంఘటన.. మహారాష్ట్ర నాగపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. సోహెబ్ ఖాన్(30), బాధితురాలు 2016 నుంచి ప్రేమించుకుంటున్నారు. బాధితురాలుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి సోహెబ్ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసి సోహెబ్ అమెను అబార్షన్ చేసుకోవాలని సూచించాడు. అయితే అబార్షన్ ఎలా చేస్తారో తెలియకపోవడంతో.. యూట్యూబ్‌లో వీడియోలు ఉంటాయని వాటిని చూసి తెలుసుకోవాలని సోహెబ్ ఆమెకు చెప్పాడు. దీనితో సోహెబ్ బలవంతంతో యువతి సొంతంగా అబార్షన్‌కు యత్నించింది. కానీ అది వికటించి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.. అటు సోహెబ్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు.