Rave Party : గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం.. భారీగా డబ్బు, మద్యం స్వాధీనం..
రేవ్ పార్టీ సంస్కృతి నగరాల్లోనే కాకుండా జిల్లాలకు కూడా పాకింది. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన రేవ్ పార్టీ స్థానికంగా కలకలం సృష్టించింది. నల్లజర్ల మండలం ఘంటవారిగూడెంలో గుట్టచప్పుడు కాకుండా రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు...మొత్తం 28 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. బర్త్డే సందర్భంగా ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. యువతులతో ఆశ్లీల నృత్యాలు చేయించినట్లుగా పోలీసులు గుర్తించారు. అనుమతులు లేకుండా జరిగిన ఈ పార్టీ లో భారీగా డబ్బు, మద్యం బాటిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా ఈ రేవ్ వెనుకున్న అసలు సూత్రధారి ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.