NRI శ్రీనివాస్ హత్యకు రెక్కీ..
కానూరు ట్రస్టు భూముల కోసం పోరాడుతున్న ఎన్నారై శ్రీనివాస్ హత్యకు రెక్కీ నిర్వహించడం దారుణమన్నారు సమతా సైనిక్ దళ్ ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబు.;
విజయవాడ శివారులో ఉన్న కానూరు ట్రస్ట్ భూములు కబ్జా చేసేందుకు వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దాదాపు వంద కోట్ల విలువైన ఈ భూముల్ని కబ్జా చేసేందుకు ఏకంగా NRIని హత్య చేసేందుకు స్కెచ్ వేశారు. ఇందుకోసం కిరాయి మూకను రంగంలో దించారు. రాత్రి హైకోర్టు ప్రాంగణం వద్ద ఎన్నారై శ్రీనివాసరావు హత్యకు స్కెచ్ వేయడంపై ఇప్పుడు దుమారం రేగుతుంది. విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి. పలువురు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు.
కానూరు ట్రస్టు భూముల కోసం పోరాడుతున్న ఎన్నారై శ్రీనివాస్ హత్యకు రెక్కీ నిర్వహించడం దారుణమన్నారు సమతా సైనిక్ దళ్ ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబు. శ్రీనివాస్ పక్షాన న్యాయ సహాయం చేస్తున్న లాయర్ మహేష్‌పైనా హత్యకు కుట్ర జరుగుతోందన్నారు. పోలీసులు, కబ్జాకోరులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. న్యాయవాదులకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాది హత్యకు రెక్కీపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.