Nellore Crime : ఆస్తి కోసం 85 ఏళ్ల తల్లినే..

Nellore Crime : నెల్లూరు జిల్లా కావలిలో దారుణం జరిగింది. ఆస్థికోసం కన్నతల్లినే కిడ్నాప్‌ చేశాడు ఓ దుర్మార్గుడు.;

Update: 2022-08-23 02:12 GMT

Nellore Crime : నెల్లూరు జిల్లా కావలిలో దారుణం జరిగింది. ఆస్థికోసం కన్నతల్లినే కిడ్నాప్‌ చేశాడు ఓ దుర్మార్గుడు.ఆస్థి తన పేర రాయాలంటూ 85 సంవత్సరాల మహాలక్షమ్మను గత కొంతకాలంగా వేధిస్తున్నాడు CISP ASIగా పనిచేసి రిటైర్డ్ అయిన కోటేశ్వరరావు.

కొడుకు వేధింపులు భరించలేక కూతురు దగ్గర తలదాచుకుంటుంది.అయితే సినీ ఫక్కీలో మూతికి గుడ్డలు కట్టి మరీ కిడ్నాప్‌ చేశాడు.. అడ్డం వచ్చిన అక్కా,బావ, వారి పిల్లలను కూడా కొట్టి తల్లిని లాక్కెళ్లాడు కోటేశ్వరరావు. ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ పుటేజ్‌ను పరిశీలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News