Money Seized : రూ. 22 లక్షల హవాలా డబ్బు సీజ్ .. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Update: 2024-11-23 10:15 GMT

అక్రమంగా రూ.22 లక్షల హవాలా డబ్బును తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఘటన సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గురువారం కోఠి సుల్తాన్ బజార్ గుజరాతీ గల్లీలో భారీగా హవాలా డబ్బు రవాణా జరుగుతుందని పోలీసులకు విశ్వసనీయ సమాచారం మేరకు పట్టకున్నారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస చారి, సిబ్బంది దీపక్, మత్స్యగిరి, నవీన్ రెడ్డి, కృష్ణమూర్తిలతో కలిసి రంగంలోకి దిగారు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మొఘల్ పురాకు చెందిన రియల్ ఎస్టేట్, ఫర్నిచర్ వ్యాపారం చేసే అబ్దుల్ ఖయ్యుం (47), సుల్తాన్ బజార్ గుజరాతీ గల్లీకి చెందిన పద్మావతి ఎలక్ట్రానిక్ షాపు నిర్వహించే ఉత్తమ్ కుమార్ (34), అదే గల్లీకి చెందిన రాజ్ ఎంటర్ప్రైజెస్ మొబైల్ షాప్ యజమాని లలిత్సాంగ్(32)లు గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో గుజరాతీ గల్లీలోని ఆర్కి కాంప్లెక్స్ ఎదురుగా కలుసుకుని, బ్లూ కలర్ బ్యాగును పట్టుకొని అనుమానాస్పదంగా కనిపించారు. స్వాధీనం చేసుకున్న నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News