Vijayawada : తృటిలో తప్పిన ప్రమాదం.. 23 మంది సురక్షితం..
Vijayawada : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.;
Vijayawada : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కంచికచర్ల మండలం కీసర బిజెటి కాలేజీ వద్ద ఇసుక టిప్పర్‌ను ఆర్టీసీ వెన్నెల బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సులో 29 ప్రయాణికులు ఉన్నారు. వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. టిప్పర్ డ్రైవర్‌ను చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.