Saidabad Incident: చిన్నారి హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య
సైదాబాద్ చిన్నారి హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు.;
Saidabad Incident: సైదాబాద్ చిన్నారి హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్ ఘన్‌పూర్.. వరంగల్ రైల్వే ట్రాక్‌పై రాజు డెడ్ బాడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే పట్టాలపై తల లేకుండా కేవలం మొండెం మాత్రమే కనిపిస్తోంది. రాజు చేతి మీద మౌనిక అని పచ్చబొట్టు కూడా కనిపిస్తోంది. దీన్నిబట్టి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి రాజునేనని నిర్దారించారు పోలీసులు. రైలు వస్తున్న వేళ ట్రాక్‌పై పడుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు.
వారం రోజులుగా రాజు కోసం హైదరాబాద్ నగరం మొత్తాన్ని జల్లెడ పట్టారు పోలీసులు. అయితే, నిందితుడు రాజు వరంగల్ వైపు వెళ్లాడు. స్టేషన్ ఘన్‌పూర్ రైల్వే ట్రాక్‌పై ఓ యువకుడి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ యువకుడు నిందితుడు రాజేనని పోలీసులు నిర్దారించారు.
రాజు కోసం నలువైపులా వెతుకుతుండడంతో.. భయం పట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్‌కౌంటర్ చేయాలంటూ ప్రజల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఏకంగా మంత్రి మల్లారెడ్డి.. నిందితుడు కనిపిస్తే ఎన్‌కౌంటర్ చేస్తామని ప్రకటించారు. ఈ భయాల నేపధ్యంలోనే రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నట్టు కనిపిస్తోంది.