Kareemnagar: కరీంనగర్‌లో కలకలం రేపిన సెల్ఫీ సూసైడ్..
Kareemnagar: టీఆర్‌ఎస్ నేత వేధింపులు.. కరీంనగర్‌లో కలకలం రేపిన సెల్ఫీ సూసైడ్..;
Kareemnagar: కరీంనగర్ తిరుమలనగర్లో సెల్పీ సూసైడ్ తీవ్రకలకలం రేపింది. నగరానికి చెందిన తిప్పారపు శ్రీనివాసాచారి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను సూసైడ్‌కు పాల్పడే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో తీవ్ర అలజడి సృష్టిస్తోంది. తనకు చెందాల్సిన ఆస్తిని టీఆర్ ఎస్ నేత, తన అన్న అయిన తిప్పారపు ఆంజనేయులు అక్రమంగా అతని భార్యపేరుమీద రిజిస్ట్రేషన్ చేయించాడని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.
తన అక్క లక్ష్మి కూడా మోసం చేసిందని మృతుడు అందులో పేర్కొన్నాడు. కరీంనగర్ భగత్ నగర్ లోని ప్రాపర్టీ విషయంలో తనకు అన్యాయం జరిగిందని.. శ్రీనివాసాచారి పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.