Shilpa Chowdary : శిల్పాచౌదరికి బెయిల్ నిరాకరణ..!

రాజేంద్రనగర్ లోని ఉప్పరపల్లి కోర్టు. మరింత లోతైన విచారణ అవసరమన్న పోలీసుల వాదనతో కోర్టు ఏకీభవించింది

Update: 2021-12-02 13:58 GMT

Shilpa Chowdary : VIPలను మోసగించిన వ్యాపారవేత్త శిల్పాచౌదరికి బెయిల్ నిరాకరించింది రాజేంద్రనగర్ లోని ఉప్పరపల్లి కోర్టు. మరింత లోతైన విచారణ అవసరమన్న పోలీసుల వాదనతో కోర్టు ఏకీభవించింది. శిల్పాచౌదరిని 5రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 5 రోజుల పాటు శిల్పాను ప్రశ్నించనున్నారు నార్సింగి పోలీసులు. మరోవైపు శిల్పా చౌదరి భర్తకు బెయిల్ మంజూరైంది. VIPల నుంచి కోట్ల రూపాయలు తీసుకుని మోసగించినట్లు శిల్పాపై ఆరోపణలున్నాయి. కిట్టీ పార్టీల పేరుతో సెలబ్రెటీలను ఆకర్షించి... కోట్లల్లో దండుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

Tags:    

Similar News