Hyderabad : సానియా మీర్జా పాల్గొన్న ప్రోగ్రామ్‌లో కాల్పులు.. వ్యక్తి అరెస్ట్

Update: 2025-03-30 07:00 GMT

హైదరాబాద్ గుడి మల్కాపూర్ లో గాలిలో కాల్పులు కలకలం రేపాయి. గుడి మల్కాపూర్ లోని కింగ్స్ ప్యాలెస్ లో ఆనం మీర్జా ఎక్స్‌పోలో ఈ ఘటన జరిగింది. ఆనం మీర్జా ఏర్పాటు చేసిన ఎక్స్‌పోలో ఇద్దరు షాప్ కీపర్ల మధ్య గొడవ చెలరేగింది. దాంతో ఒక షాప్ కీపర్ గాలిలోకి కాల్పులు జరిపాడు. తెల్లవారుజామున కింగ్స్ ప్యాలెస్ లో హసీన్ముద్దీన్ అనే వ్యక్తి తన వద్ద ఉన్న లైసెన్సు రివాల్వర్ తో రెండు రౌండ్ల ఫైర్ గాలిలో కాల్చారని పోలీసులు తెలిపారు. పెర్ఫ్యూమ్, టాయ్స్ దుకాణం యజమానుల మధ్య గొడవ జరుగుతుండడంతో గొడవను ఆపేందుకు వెళ్లి తాను కూడా కోపానికి గురై తన వద్ద ఉన్న గన్ తో రెండు రౌండ్లు గాలిలో కాల్చినట్లు ఏసీపీ తెలిపారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకొని అతని వద్ద ఉన్న రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News