Sidhu Moose Wala : సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్..

Sidhu Moose Wala : లారెన్స్‌ బిష్ణోయ్‌ మేనల్లుడు సచిన్‌ బిష్ణోయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.;

Update: 2022-08-30 13:50 GMT

Sidhu Moose Wala : సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందుతుడు అరెస్ట్ అయ్యాడు. లారెన్స్‌ బిష్ణోయ్‌ మేనల్లుడు సచిన్‌ బిష్ణోయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అజర్‌బైజాన్‌ వద్ద అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. లారెన్స్ గ్యాంగ్‌కు సచిన్ బయటి నుంచి సూచనలు ఇచ్చేవాడని ఆరోపణలున్నాయి.

ఇదిలా ఉండగా.. ముసేవాలా హత్య కేసులో మాన్సా పోలీసులు 1850 పేజీల చార్జిషీట్‌ దాఖలుచేశారు. అందులో 24 మంది నిందితుల పేర్లు ఉన్నాయి. ఇప్పటికే 20 మందిని అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితులు విదేశాల్లో తలదాచుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. విదేశాల్లో తలదాచుకున్న నిందితుల్లో గోల్డీ బ్రార్, అన్మోల్ బిష్ణోయ్, లిజిన్ నెహ్రా ఉన్నారు. 

Tags:    

Similar News