శిరీష హత్య కేసులో హంతకుడు అనిల్‌: పోలీసులు

తెలంగాణలో సంచలనం సృష్టించిన శిరీష హత్య కేసును పోలీసులు ఛేదించారు. శిరీషను దారుణంగా హత్య చేసింది ఆమె బావ అనిల్‌ అని పోలీసులు తేల్చారు

Update: 2023-06-15 05:45 GMT

తెలంగాణలో సంచలనం సృష్టించిన శిరీష హత్య కేసును పోలీసులు ఛేదించారు. శిరీషను దారుణంగా హత్య చేసింది ఆమె బావ అనిల్‌ అని పోలీసులు తేల్చారు. శారీరక సంబంధానికి ఒప్పుకోకపోవడం వల్లే ఆమెను చంపేసినట్లు ఎస్పీ తెలిపారు. అదేవిధంగా శిరీష తరచూ ఫోన్‌లో మరో వ్యక్తితో చాటింగ్‌ చేయడం, మాట్లాడుతుండటంతో అనిల్‌ మరింత కక్ష పెంచుకుంటున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు.

నిందితుడు అనిల్‌.. శిరీషపై దాడి చేసినట్లు ఎస్పీ చెప్పారు. మద్యం మత్తులో ఉన్న నిందితుడు బీరు సీసాతో దాడిచేసి నీటికుంటలో ముంచి చంపేసినట్లు వెల్లడించారు. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్‌ ట్రాక్ట్‌ కోర్టులో కేసు విచారణ జరుపుతామని ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. పోస్టుమార్టం నివేదికలో శిరీషపై అత్యాచారం జరగలేదని వెల్లడైనట్టు ఎస్పీ చెప్పారు.

Tags:    

Similar News