పంజాబ్ లోని లూధియానాకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కమల్ కౌర్(30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పార్క్ చేసిన కారులో వెనుక సీట్లో ఆమె డెడ్ బాడీ లభించింది. లూధియా నాకు చెందిన కమల్ కౌర్ కు ఇన్స్టాగ్రామ్ లో 3.83 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె రీల్స్, వీడియోలు చేస్తుంటారు. తన వీడియోల్లో అసభ్య పదజాలం వాడటం గతంలో వివాదానికి దారి తీసింది. మూడు రోజుల క్రితం వీడియోలు తీసేందుకు బతిండా వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి బయలు దేరిన ఆమె నిన్న రాత్రి ఆదేశ్ మెడికల్ యూనివర్సిటీ వద్ద పార్కు చేసి ఉన్న కార్లో శవమై కనిపించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కారు వెనుక సీట్లో డెడ్ బాడీ లభించడంతో వేరే చోట ఆమెను చంపి అక్కడికి తీసుకొచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వాస్తవంగా కాంచన్ లూధియానాలో నివాసం ఉంటుంది. మృతదేహం కుళ్లిపోయిన దశలో ఉండటంతో.. ఆమెను ఎక్కడో హత్య చేసి ఆస్పత్రి వద్ద ఆ మృతదేహంతో కారును వదిలేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పార్కింగ్ ప్రాంతం నుంచి దుర్వాసన వస్తుండటంతో మృతదేహాన్ని గుర్తించారు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని షహీద్ భాయ్ మణిసింగ్ ఆస్పత్రిలో భద్రపర్చారు.