Suryapet: సూర్యాపేట జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తండ్రిని కడతేర్చిన కొడుకులు..
Suryapet: సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. భూమి పంచివ్వలేదన్న కోపంతో.. కన్న తండ్రిని కొడుకులు దారుణంగా నరికి చంపారు.;
Suryapet: సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. భూమి పంచివ్వలేదన్న కోపంతో.. కన్న తండ్రిని కొడుకులు దారుణంగా నరికి చంపారు. ఆత్మకూరు మండలం పెన్‌పహాడ్‌కు చెందిన ఎరగాని శ్రీను గౌడ్‌కు కొంత వ్యవసాయ భూమి ఉంది. గత కొంత కాలంగా శ్రీను ఇద్దరు కొడుకులు.. సంతు, రాజశేఖర్‌లు తమకు భూమి పంచివ్వాలని తండ్రితో గొడవ పడేవారు. ఎన్ని సార్లు అడిగినా భూమి ఇవ్వకపోవడంతో.. ఉదయం శ్రీను గౌడ్‌పై కత్తులతో దాడి చేసి కిరాతకంగా నరికి చంపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.