Rangareddy District: విద్యార్ధినిపై టీచర్ క్రూరత్వం.. మాట్లాడుతుంటే ఉమ్ము పడిందని..
Rangareddy District: మే ఐ కమిన్ టీచర్ అన్నప్పుడు ఉమ్ము బయటికొచ్చిందని విద్యార్ధిని వాతలు తేలేలా కొట్టింది.;
Rangareddy District: రెండో తరగతి చదువుతున్న 8ఏళ్ల పిల్లాడిపై ప్రతాపం చూపించింది క్లాస్ టీచర్. మే ఐ కమిన్ టీచర్ అన్నప్పుడు ఉమ్ము బయటికొచ్చిందని విద్యార్ధిని వాతలు తేలేలా కొట్టింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ఫతేపూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సంజీవ్ కుమార్‌ను.. క్లాస్ టీచర్ శ్వేత తీవ్రంగా కొట్టింది. దీంతో విద్యార్ధి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అకారణంగా పిల్లాడిని వాతలు తేలేలా కొట్టడంతో శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. టీచర్‌ను సస్పెండ్ చేయాలని, ఆమెను జైలుకి పంపించాలని డిమాండ్ చేశారు.