పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు కమ్రాన్ అక్మల్, ఉమర్ అక్మల్‌కు చెందిన లాహోర్ ఫామ్‌హౌస్‌లో దొంగలు పడ్డారు. పట్టపగలే రూ.5లక్షల విలువైన సౌర విద్యుత్ పలకలను దోచుకెళ్లిపోయారు. ముందురోజే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని, ఒకరోజు కూడా గడవకుండానే దొంగలు దోచేశారని అక్మల్ తండ్రి వాపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. తన కెరీర్ లో 53 టెస్టులు, 157 వన్డేలు, 58 టీ-20 మ్యాచ్ లు ఆడాడు. వికెట్ కీపర్ కం బ్యాటర్ గా పాకిస్తాన్ జట్టు విజయాలలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం డొమెస్టిక్ లీగ్ మ్యాచ్లలో పాల్గొంటున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} టోర్నిలోనూ మెరిశాడు. 2008 ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆరు మ్యాచ్లలో ఆడాడు కమ్రాన్. ఈ ఆరు మ్యాచ్లలో ఒక ఆఫ్ సెంచరీ తో సహా 128 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ స్టేజ్ లోనే టోర్నీ నుండి తప్పుకున్న పాకిస్తాన్ జట్టు.. తాజాగా కరాచీ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన టి-20 మ్యాచ్ లో సైతం ఘోర ఓటమిని చవిచూసింది.