మాయ మాటలతో ఎదుటి వ్యక్తుల దగ్గర మోసం చేసి 3 తులలు బంగారాన్ని అపహరించుకెళ్లున ఘటన రాయదుర్గం నియోజకవర్గం లో చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి రాంపూరం నుండి రాయదుర్గనికి వెళ్తున్నాడు.మార్గమధ్యలో డి. హీరేహాల్ మండలం హడగాలి గ్రామ రైల్వే గేట్ సమీపం లో బైక్ పై వెళ్తున్న ఆంజనేయులు ను ఇద్దరు దుండగులు ఆపి అతనితో కల్లిబుల్లి మాటలు చెప్పి ఇక్కడ దొంగలు ఉన్నారు నీ ఒంటి పై ఉన్న బంగారాన్ని ఒక పేపర్ లో పెట్టుకోమని ఆ పేపర్ ను దుండగులు ఇచ్చి బంగారాన్ని ఆ పేపర్లో పెట్టారు.ఆ దుండగుకు మాయమాటలతో ఆ పేపర్లో ఉన్న బంగారాన్ని చాక్యంగా అపహరించిన మరొక పేపర్లో రాళ్ళను పెట్టీ ఆంజనేయులకు ఇచ్చారు. అక్కడి నుండి ఆ దుండగులు. బంగారాన్ని అపహరించుకొనీ పారిపోయారు. చివరకు ఆంజనేయులు ఆపేపరు తీసి చూడగా అందులో రాళ్ళు ఉన్నాయని అతను వాపోయాడు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రూరల్ సిఐ వెంకటరమణ, ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి తన సిబ్బందితో ఘటన స్థలంగా చేరుకొని విచారణ చేపట్టారు.దాదాపు 3లక్షలు విలువచేసే బంగారాన్నీ అపహరింనట్టు బాధితుడు తెలిపారు.ఈ ఘటన కర్ణాటక ఆంధ్రా సరిహద్దు ప్రాంతం లో జరగడంతో పోలీసులు ప్రత్యేక సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు.