Thief : ఎర్రకోట కలశాల చోరీ కేసు దొంగ దొరికాడు

Update: 2025-09-09 06:30 GMT

దేశ వ్యాప్తంగా కలకలం రేపిన ఎర్రకోట కలశాల చోరీలో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. రూ.1.5 కోట్ల విలువైన బంగారు కలశాలు చోరీకి గుర య్యాయి. జైన పూజారి వేషంలో వచ్చిన దొంగ బంగారు వస్తువులతో ఉడాయిం చినట్లు సీసీటీవీ ఫుటేజీ బయటపెట్టింది. ఆగస్టు 15 నుంచి పార్కు వద్ద దస్లక్షన్ మహోత్సవ పేరిట జైన మతస్థులకు చెందిన 10 రోజుల ఉత్సవాలు జరుగుతున్నాయి. బుధవారం పూజా క్రతువు కోసం ఏర్పా ట్లు జరుగుతుండగా ఈ చోరీ జరిగింది. ఓ బంగారు కలశం, 760 గ్రాముల బరువున్న బంగారు కొబ్బరికాయ, మరో 115 గ్రాముల బరువుతో వజ్రాలు, ఎమె రాల్డ్స్, రూబీలు పొదిగిన చిన్న బంగారు కలశంతో సహా విలువైన పూజా పాత్రలు మాయమయ్యాయి. జైన పూజారి వేషంలో

వచ్చిన దొంగ బంగారు వస్తువులతో ఉడాయించినట్లు సీసీటీవీ ఫుటేజీ బయట పెట్టింది. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు భూషణ్ వర్మ గా గుర్తించారు. అతడిని ఉత్త రప్రదేశ్ లోని హాపూర్ లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పూజారి వేషంలో ఉన్న అతడు జైన మతానికి చెందిన వాడు కాదని పోలీసు వర్గాలు తెలిపాయి. అతడు అనేక కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు వెల్ల డించారు. నిందితుడిని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News