Robbery : దొంగలు బీభత్సం .. నాలుగిళ్లల్లో చోరీలు

Update: 2025-02-19 13:15 GMT

కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన గుదె వెంకటేశ్వరరావు , చాగంటి దేవేంద్ర ఇంట్లో మొత్తం నాలుగు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు దొంగలు.. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలం వద్దకు చేరుకున్నారు... ఇళ్లల్లో ఎవరూ లేని సమయంలో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి రెక్కి నిర్వహించి దొంగతనానికి పాల్పడ్డారు. గుదె వెంకటేశ్వరరావు అనే ఇంటి యజమాని కొంతకాలం క్రితం మరణించడంతో అతని భార్య విజయవాడలో ఉంటున్న తన కూతురు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ దొంగతనం జరిగినట్లుగా భావిస్తున్నారు పోలీసులు. అలాగే చాగంటి దేవేంద్ర నందిగామ లో ఫెర్టిలైజర్ షాప్ లో విధులు నిర్వహణలో భాగంగా నందిగామ వెళ్ళినప్పుడు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు. నాలుగు ఇళ్లల్లో నగలు ,డబ్బు తదితర వస్తువులు ఎంత చోరీకి గురైనవి అనే విషయం తెలియాల్సి ఉంది క్లూ టీమ్ ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు

Tags:    

Similar News