మినీబస్సుపై కాల్పులు జరిపిన దొంగలు.. 35 మంది యాత్రికులను రక్షించిన డ్రైవర్
మహారాష్ట్రలోని అమరావతి-నాగ్‌పూర్ హైవేపై దొంగలు వెంబడించి కాల్పులు జరిపారు..;
మహారాష్ట్రలోని అమరావతి-నాగ్‌పూర్ హైవేపై దొంగలు వెంబడించి కాల్పులు జరిపారు.. కనీసం 35 మంది యాత్రికుల ప్రాణాలను ఒక మినీబస్సు డ్రైవర్ ధైర్యంగా వారిని రక్షించారు. యాత్రికులు ఆదివారం బుల్దానా జిల్లాలోని షెగావ్ నుండి నాగ్‌పూర్‌కు వెళుతుండగా, కారులో వెంబడించిన ముఠా వారు ప్రయాణిస్తున్న మినీబస్సును ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించింది.
హైజాకర్లు వాహనాన్ని హైవేపై దాదాపు 30కిలోమీటర్ల వరకు వెంబడించారు. అయినప్పటికీ, బస్సు డ్రైవర్ ఖోమ్‌దేవ్ కవాడే బుల్లెట్ల మోత తన నరాలను మెలిపెడుతున్నా, ప్రయాణికులను సురక్షితంగా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించే వరకు ధైర్యంగా ఉన్నాడు.
యాత్రికులు అమరావతిలోని అంబే మాత ఆలయం నుండి నాగ్‌పూర్‌కు బయలుదేరిన కొద్దిసేపటికే, వారు నంద్‌గావ్‌పేట టోల్‌నాకా దాటిన తర్వాత బస్సును దొంగలు వెంబడిస్తున్నారని కవాడే గుర్తించాడు.
vThieves chased and opened fire on the Amaravati-Nagpur highway in Maharashtraప్రారంభంలో, అతను బుల్లెట్లు తమ వైపుకు దూసుకురావడాన్ని గమనించాడు. దుండగులు విండ్‌స్క్రీన్‌పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. చాలా బుల్లెట్‌లు అతన్ని దాటుకుని వెళ్లిపోయాయి. కానీ ఒక బుల్లెట్ అతడి చేతికి గాయం చేసింది. అయినా డ్రైవర్ స్టీరింగ్ వదల్లేదు. అలాగే బాధను భరిస్తూనే ప్రయాణీకులను ఎలాగైనా కాపాడాలని తలంచాడు.
చేతికి తగిలిన బుల్లెట్ గాయంతో రక్తస్రావం అవుతోంది. అలసిపోయిన అతను నాగ్‌పూర్‌కు 100కిమీ దూరంలో ఉన్న సవాడి గ్రామంలో హైజాకర్‌లను దాటుకుని చివరకు టీయోసా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు.
''యాత్రికులందరూ సురక్షితంగా ఉన్నారని నిర్ధారించారు" అని పోలీస్ అధికారి తెలిపారు. అమరావతి పోలీసులు బస్సును తిరిగి నందగావ్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించి, డ్రైవర్‌ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.