Vizianagaram : కెమెరాకు చిక్కిన పులి.. కాకినాడ నుంచి విజయనగరం వరకు..
Vizianagaram : విజయనగరం జిల్లాలో పులి సంచారం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది.;
Vizianagaram : విజయనగరం జిల్లాలో పులి సంచారం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. మెరకముడిదాం మండలం పులిగుమ్మి గ్రామ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద అటవీశాఖ అధికారులు సీసీ కెమెరాలు పెట్టారు. పులి వచ్చిన దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో ఆ ఫోటోలు, వీడియోలను డెహ్రాడూన్‌లో ఉన్న వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ టైగర్ జోన్‌కి పంపించారు.
కాకినాడ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి.. ఈ పులి ఒకటేనేమోనన్న అనుమానంతో నిర్ధారణ కోసం పంపించినట్లు జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేష్ తెలిపారు. రెండు రోజుల క్రితం ఆవుని వేటాడి తీసుకెళ్తుండగా దృశ్యాలు రికార్డయ్యాయన్నారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దండోరా వేయించారు.