Crime: కుప్పంలో విషాదం: ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్యాయత్నం..

Update: 2025-09-11 06:33 GMT

చిత్తూరు జిల్లా కుప్పంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏం కష్టం వచ్చిందో గాని...ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య యత్నానికి పాల్పడడం స్థానికంగా విషాదాన్ని నింపింది.వీరిలో ఇద్దరు మృతి చెందగా... మరో ఇద్దరు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం...కుప్పం మున్సిపాలిటీ కొత్తపేటలో నివాసం ఉంటున్న నలుగురు కుటుంబ సభ్యులు తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని కె.ఆర్.పి. డ్యామ్‌లో ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వీరిలో ఇద్దరి మృతదేహాలు డ్యామ్‌లో తేలడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మరో ఇద్దరిని స్థానిక జాలర్లు కాపాడారు. వీరు కుప్పం కొత్తపేట కు చెందిన లక్ష్మణ మూర్తి(50) కుటుంబంగా గుర్తించారు. మృతులు లక్ష్మణ మూర్తి , ఆయన అత్తగారు శారదమ్మ(70) గా గుర్తించారు. కాగా లక్ష్మణ మూర్తి భార్య జ్యోతి (40), కూతురు కీర్తిక(20) లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు...ఆత్మహత్య కు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News