TTD AEO Suspended : చర్చికి టీటీడీ ఏఈవో.. సస్పెండ్ చేసిన అధికారులు

Update: 2025-07-09 06:30 GMT

టీటీడీ అన్యమతస్థ ఉద్యోగులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. టీటీడీ ఏఈవో రాజశేఖర్‌బాబును ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. పుత్తూరులో అన్యమత ప్రార్థనల్లో ఆయన పాల్గొనడంతో చర్యలు తీసుకున్నారు. అదే పట్టణానికి చెందిన ఓ భక్తుడు ఫొటోలు, వీడియోలతో టీటీడీ విజిలెన్స్‌కి ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన అధికారులు.. ప్రతి ఆదివారం ప్రార్థనా మందిరానికి వెళ్లినట్లు గుర్తించారు. టీటీడీ ఉద్యోగిగా ఉన్న రాజశేఖర్‌బాబు సంస్థ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని.. బాధ్యతారహితంగా వ్యవహరించడంతో చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News