AP : గంజాయి కేసులలో ఇద్ధరు నిందితుల అరెస్ట్

Update: 2025-06-26 05:30 GMT

ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర డి.జి.పి. శ్రీ హరీష్ గుప్తా ఐ.పి.ఎస్.గారి ఆదేశాల మేరకు ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ పర్యవేక్షణలో పోలీస్ కమీషనరేట్ పరిదిలో సిటి టాస్క్ ఫోర్సు మరియు లా & ఆర్డర్ పోలీసులు మరియు ఈగల్ టీమ్స్ ఐ.జి. శ్రీ ఆకే.రవికృష్ణ ఐ.పి.ఎస్. గారి పర్యవేక్షణలో ఈగల్ బృంధాలు గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలు, సరఫరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం మరియు గతంలో పలు అక్రమ మాదకద్రవ్యాల కేసులలో అరెస్ట్ కాకుండా తప్పించుకుని తిరుగుతున్న వారిపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ నేపధ్యంలో ఈ రోజు ఈగల్ టీమ్స్ మరియు లా &ఆర్డర్ పోలీసు వారికి రాబడిన పక్కా సమాచారం మేరకు కృష్ణ లంక పోలీస్ స్టేషన్ పరిదిలోని గీతానగర్ కట్ట ఏరియాలో కృష్ణలంక సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ భానుప్రసాద్ గారు వారి సిబ్బందితో కలిసి వాహన తనిఖీ చేస్తున్న సమయంలో సిఫ్ట్ డిజైర్ కార్ ఆపి వాహనాన్ని తనిఖీ చేయగా అందులో గంజాయి కలిగిన బ్యాగులను గుర్తించి డ్రైవరు ను అదుపులోనికి తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో అదే ధారిలో వస్తున్న టాటా గూడ్స్ డ్రైవరు పోలీసు వారి తనిఖీలను గమనించి వాహనం ఆపి దిగిపారిపోవడానికి ప్రయత్నించిన సమయంలో అదుపులోనికి తీసుకుని విచారించి వారి వద్ద నుండి సుమారు 15 లక్షల రూపాయల విలువైన 200 కేజీల గంజాయిని మరియు రెండు వాహనాలను స్వాదీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది.

నిందితుల వివరాలు

1. విశాఖపట్నం జిల్లా, తగరపు వలస, భీముని పట్నం, ఏరియాకు చెందిన అండి నాగరాజు (26 సం)

2. తమిళనాడు రాష్ట్రం, ఉత్తమ పలయాన్, కక్కి సింగయన్ పట్టి గ్రామానికి చెందిన అనబలగన్ సిన్రసు (46 సం.)

ప్రధాన నిందితుడు అండి నాగరాజు సొంత ఊరు తమిళనాడులోని మధురై కాని బ్రతుకుదెరువు దెరువు నిమిత్తం చిన్నతనంలోనే తగరపు వలస వచ్చి జీవిస్తున్నాడు. చిన్నతనంలో కొంతకాలం మధురై లో ఉన్నాడు. ఈ సమయంలో అక్కడ గంజాయికి ఎక్కువ డిమాండ్ ఉందని తెలుసు. తరువాత తగరపు వలస లో నివశిస్తున్న సమయంలో చుట్టుపక్కల ఏజెన్సీ గ్రామాలలో ఎక్కువగా గంజాయి సాగు జరుగుతుందని తెలుసుకుని దీనిని ఈ గ్రామాలలో తక్కువ రేటుకు కొనుగోలు చేసి చెన్నై లో ఎక్కువ రేటుకు అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేయచ్చు అనుకుని తమిళనాడులో ఉంటున్న సమయంలో పరిచయం ఉన్న అనబలగన్ సిన్రసు కు తన పధకం చెప్పగా తనుకూడా సరేనని చెప్పి పోలీసు వారు అనుమానించకుండా గంజాయిని తరలించడానికి గూడ్స్ వాహనంలో కొంతబాగానికి అరలగా తయారు చేయించి అందులో గంజాయి బ్యాగ్ లను పెట్టి పైన ఖాళీ ఐస్ బాక్స్ లను పెట్టి తరలించే వాడు. ఒక సారి ఆ గూడ్స్ వాహనానికి ముందు మరొక కారును నాగరాజు డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ పోలీసు వారి సమాచారం ఎప్పటికప్పుడు సిన్రసు కు తెలియజేస్తూ అప్రమత్తం చేసి గంజాయి తరలించారు. ఈ క్రమంలో రెండు సార్లు అరెస్టు అయ్యి జైలుకు కూడా వెళ్ళినారు.

జైలు నుండి విడుదలైన అనంతరం తన ప్రవుత్తిని మనుకోకుండా చుట్టుపక్కల ఏజెన్సీ గ్రామాలలో 200 కేజీల గంజాయిని కొనుగోలు చేసి అనబలగన్ సిన్రసు కు ఫోన్ చేసి వాహనాన్ని తీసుకుని రమ్మని చెప్పి అందులో 100 కేజీల గంజాయిని ఇతని కారులో మరో 100 కేజీల గంజాయిని లోడ్ చేసుకుని పాత పద్దతి ప్రకారం కారు ముందు వెనుక మినీ గూడ్స్ వాహనంతో చెన్నై కి బయలుదేరినారు. ఈ క్రమంలో ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు వారికి రాబడిన పక్కా సమాచారం మేరకు కృష్ణ లంక పోలీసు స్టేషన్ పరిదిలోని గీతానగర్ కట్ట సమీపంలో కృష్ణలంక సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ భానుప్రసాద్ గారు వారి సిబ్బందితో కలిసి ఇద్దరు నింధితులను అదుపులోనికి విచారించి వారివద్ద నుండి సుమారు 15 లక్షల రూపాయల విలువైన గంజాయిని మరియు గంజాయి తరలించడానికి ఉపయోగించిన పైన తెలిపిన రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని అరెస్టు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు, సౌత్ ఏ.సి.పి. శ్రీ డి.పావన్ కుమార్ గారు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News