శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లిలో ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. నిన్నటి నుండి కనుబడుట లేదు. గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి నుసేటి విష్ణువర్ధన్, పన్నిండేళ్ల మనుబోటి నవ శ్రావణ్ లు బుధవారం గ్రామంలో పాడుబడిన బావిని పూడ్చేందుకు గ్రామ శివారు నుంచి మట్టి తోలుతున్న ట్రాక్టర్లలో ఎక్కి వెళ్లారు. అక్కడి నుంచి ఎటు వెళ్లారు సాయంత్రం అయినా ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామస్తులు, బంధువుల సహాయంతో గ్రామ సమీపంలోని కాలువలు, ఏర్లు, అటవీ ప్రాంతంలో నిన్న పొద్దుబోయే వరకు గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈరోజు ఉదయం నుంచి పోలీసులు డ్రోన్ కెమెరాలతో చిన్నారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.